NIFTY TRADE: 17300 కీలకం
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,438 కోట్ల అమ్మకాలు జరిపారు. దేశీయ సంస్థలు రూ.2,051 కోట్ల కొనుగోళ్ళు చేశాయి. అయితే ఎంత కాలం విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను దేశీయ మార్కెట్ ఆపగలుగుతుందనేది ఇపుడు మార్కెట్‌లో కీలక ప్రశ్న. రీటైల్ ఇన్వెస్టర్లు గనుక పెట్టబడులు ఆపితే… పరిస్థితి ఎలా అన్న చర్చ మార్కెట్‌లో జరుగుతోంది. ఆప్షన్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక నిఫ్టి విషయానికి వస్తే సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ అంచనా ప్రకారం నిఫ్టికి 17341 లేదా 17288 వద్ద మద్దతు లభించే అవకాశముంది. ఇక్కడ కూడా మద్దతు లభించని పక్షంలో 17212 లేదా 17130 వరకు వెయిట్ చేయమని ఆయన సలహా ఇస్తున్నారు. బ్యాంక్ నిఫ్టితో పాటు ఇతర వ్యూహాల కోసం ఈ వీడియో చూడగలరు.