For Money

Business News

MID SESSION: పెరిగినపుడల్లా ఒత్తిడి

మార్కెట్‌ ఉదయం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనౌతోంది. ఏ కాస్త పెరిగినా వెంటనే అమ్మకాల జోరుగా పెరుగుతోంది. ఉదయం భారీ నష్టాల నుంచి కోలుకుని 16477ని తాకిని తరవాత 16344కి పడిపోయింది. ఆ తరవాత మూడు సార్లు 16400 స్థాయిని అధిగమించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీగా పడిన మార్కెట్లు ఇవాళ కూడా 1.5 శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఆరంభంలో ఒక మోస్తరుగా ఉన్న నష్టాలు.. క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో నిఫ్టి ఇవాళ చివర్లోనైనా కోలుకుంటుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం 323 పాయింట్ల నష్టంతో 16358 వద్ద ట్రేడవుతోంది.చాలా రోజుల తరవాత దివీస్‌ ల్యాబ్‌లో తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. రెండు నెలల నుంచి రూ. 4400- రూ.4500 ప్రాంతంలో ఉన్న ఈ షేర్‌ ఇవాళ రూ.4160ని తాకింది.యూపీఎల్‌, హిందాల్కో నిఫ్టి టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక గ్రీన్‌లో ఉన్న షేర్లలో హీరో మోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, పవర్‌ గ్రిడ్, ఎన్‌టీపీసీ షేర్లు ఉన్నాయి. నిఫ్టితో పోలిస్తే ఇతర సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. అన్నీ రెండు నుంచి రెండున్నర శాతం నష్టంలో ఉన్నాయి.