స్థిరంగా SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. క్రూడ్ ధరలు భారీగా క్షీణించడంతో డౌజోన్స్‌పై ఒత్తిడి వచ్చినా నామ మాత్రపు నష్టం (0.13శాతం)తో ముగిసింది. ఎస్ అండ్ పీ 0.39 శాతం నష్టపోగా… నాస్డాక్ మరో ఒక శాతం కోల్పోయింది. ఐటీ, టెక్ షేర్లు సూచీలు 40 శాతం పైగా పడినా.. ఇంకా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. డాలర్ స్వల్పంగా పెరిగి 107.5 ప్రాంతంలో ఉంది. క్రూడ్ కూడా కోలుకుని ఇపుడు గ్రీన్‌లో ఉంది. బ్రెంట్ క్రూడ్ దాదాపు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈనేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి జపాన్ నిక్కీ తప్ప. జపాన్ నిక్కీ 0.73 శాతం లాభంతో ఉంది. అలాగే ఆస్ట్రేలియా సూచీ కూడా అర శాతం లాభంతో ఉంది. మిగిలిన మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. హెచ్చుతగ్గులు లేవు. హాంగ్‌సెంగ్ మాత్రం 0.79 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 35 పాయింట్ల లాభంతో ఉంది. సో.. నిఫ్టి కూడా స్థిరంగా ఓపెన్ అయ్యే అవకాశముంది.