నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
వరుసగా ఆరు రోజుల నష్టానికి రాత్రి వాల్‌స్ట్రీట్ బ్రేక్ వేసింది.కాని ఆసియా మార్కెట్లలో మాత్రం అమ్మకాలు ఆగడం లేదు. అన్ని స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండటం విశేషం. జపాన్ నిక్కీ 1.84 శాతం, ఆస్ట్రేలియా 2.57 శాతం, హాంగ్‌సెంగ్ 1.67శాతం. షాంఘై సూచీ ఒక శాతం, తైవాన్ 1.6 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపుతోపాటు ఉక్రెయిన్ యుద్ధ భయాలు మార్కెట్‌ను భయపెడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉండటంతో… ఆసియా మార్కెట్లలో రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. సింగపూర్ నిఫ్టి 0.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. వెరశి…నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది.