16700 పైన నిఫ్టి… నిలబడేనా?

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా మెటల్స్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఈ రెండు దేశాల నుంచి క్రూడ్, మెటల్స్ ఎగుమతులు అధికంగా ఉంటాయి. యుద్ధం కారణంగా వీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. దీంతో మన దేశంలో మెటల్స్ కంపెనీలకు ఇది సానుకూల అంశం. ఉదయం నుంచి మెటల్స్ షేర్లు భారీగా పెరిగయాఇ. నిఫ్టి 350 పాయింట్లు కోలుకుని 16734 పాయింట్లకు చేరింది. అయితే బ్యాంకు షేర్లలో ఒత్తిడి బాగా కన్పిస్తోంది. మరోవైపు యూరో ఫ్యూచర్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.అనేక సూచీలు 2శాతం నుంచి 3 శాతం దాకా నష్టపోయాయి. మహా శివరాత్రి రేపు మన మార్కెట్లకు సెలవు. దీంతో క్లోజింగ్ వరకు ఈ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. మరోవైపు ఉదయం కనిష్ఠ స్థాయికి క్షీణించి కొన్ని కంపెనీల షేర్ల ధరలు ఇవి…