MID DAY REVIEW: లాభాల్లోకి నిఫ్టి
మరికాస్సేపట్లో యూరో మార్కెట్ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. అన్ని ఫ్యూచర్స్ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఉదయం భారీ నష్టాల్లో జారుకున్న నిఫ్టి దిగువ స్థాయి నుంచి దాదాపు 200 పాయింట్లు కోలుకుంది. ఉదయం 17,181 పాయింట్ల ప్రారంభమైన నిఫ్టి 12 గంటలకల్లా 17003 స్థాయికి చేరింది. అక్కడి నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చింది. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్ అద్భుతంగా కోలుకుంది. భారీ నష్టాల నుంచి ఈ సూచీ కూడా 600 పాయింట్లు కోలుకుంది. 2 శాతం దాకా నష్టపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దాదాపు గ్రీన్‌లోకి వచ్చేసింది. ఈ వారం వీక్లీ, మంత్లీ డెరివేటివ్ క్లోజింగ్ కావడంతో నిఫ్టిలో షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. క్రూడ్ ధరలు తగ్గడం కూడా మార్కెట్‌కు పాజిటివ్‌గా మారింది.