17000పైన కొనసాగుతున్న నిఫ్టి
యూరో మార్కెట్ల భారీ నష్టాలను మన మార్కెట్లు పట్టించుకోవడం లేదు. ఇవాళ ఇంగ్లండ్‌తోపాటు కొన్ని మార్కెట్లకు సెలవు. అయితే ఇవాళ పనిచేస్తున్న మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. యూరో స్టాక్స్ 50 సూచీ 1.7 శాతం నష్టంతో ఉంది. జర్మనీ డాక్స్ ఒక శాతం నష్టపోగా, ఫ్రాన్స్ వంటి మార్కెట్లు రెండు శాతం నష్టపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 17020 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి 0.36 శాతం నష్టపోగా.. మిగిలిన సూచీల్లో భారీ నష్టాల లేవు. నిఫ్టి ఇవాళ 16917కు క్షీణించి వంద పాయింట్లు కోలుకుంది. మరి ఈ రికవరీ కొనసాగుతుందా? లేదా అమ్మకా ఒత్తిడిని ఎదుర్కొంటుందా అన్నది చూడాలి.