For Money

Business News

నిఫ్టికి యూరో, ఫ్యూచర్స్‌ కిక్‌

నిన్నటి నష్టాలు నేటి లాభంతో సరి అన్నచందంగా మార్కెట్‌ ఇవాళ పెరిగింది. మిడ్‌ సెషన్‌ వరకు హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్‌ ఆ తరవాత నిలదొక్కుకుంది. ఉదయం ఆరంభమైన గంటకే నష్టాల్లోకి వెళ్ళిన మార్కెట్‌ తరవాత కోలుకున్నా.. యూరో మార్కెట్ల ట్రెండ్‌ స్పష్టమయ్యే లోగా మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళింది అమెరికా ఫ్యూచర్స్‌తోపాటు యూరో మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడ్‌ కావడం ప్రారంభించడంతో నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17,326 నుంచి 250 పాయింట్ల మేర పెరిగి 17,578 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 165 పాయింట్ల లాభంతో 17,562 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి జోరుగా సాగినా… బ్యాంక్‌ నిఫ్టి మాత్రం నామమాత్రపు లాభాలకే పరిమితమైంది. మెటల్స్‌ ఇవాళ మళ్ళీ కోలుకున్నాయి. మిడ్‌ క్యాప్‌, నిఫ్టి నెక్ట్స్‌ కూడా 0.8 శాతం లాభంతో ముగిశాయి. ఎల్లుండి ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయాలు వెలువడే వరకు మార్కెట్‌లో తీవ్ర ఒడుదుడుకులు తప్పవేమో. పైగా రేపు చైనా మార్కెట్లు ఓపెన్‌ కానున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 671.00 5.97
ఓఎన్‌జీసీ 135.15 5.18
బజాజ్‌ ఫైనాన్స్‌ 7,820.00 5.07
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,140.00 4.59 టాటా స్టీల్‌ 1,296.50 3.46

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
మారుతీ 6,780.00 -2.45
బీపీసీఎల్‌ 414.20 -1.47
హీరో మోటోకార్ప్‌ 2,855.00 -1.19
బజాజ్‌ ఆటో 3,732.00 -1.17
నెస్లే ఇండియా 20,138.85 -0.90