For Money

Business News

నష్టాలన్నీ పూడ్చుకున్న నిఫ్టి

ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌ కల్లా నష్టాలను పూడ్చుకుంది. క్రితం ముగింపు 16411 కాగా, మిడ్‌ సెషన్‌లో 16403ని తాకింది. ఆ తరవాత స్వల్ప లాభాల స్వీకరణ కారణంగా ప్రస్తుతం 74 పాయింట్ల నష్టంతో 16336 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ కూడా 240 పాయింట్ల నష్టంతో 54595
పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం నష్టాల్లో ఉన్న ఐటీ షేర్లు మిడ్ సెషన్‌ కల్లా భారీ లాభాల్లోకి వచ్చాయి. ఉదయం హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ లూజర్‌గా ఉండేది.. ఇపుడు టాప్‌ గెయినర్స్‌లో ఇన్ఫోసిస్‌ తరవాత రెండో స్థానంలో ఉంది. గత వారం బాగా క్షీణించిన పలు కౌంటర్లు ఇవాళ కోలుకున్నాయి. ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో రిలయన్స్‌ షేర్‌ మూడు శాతం దాకా నష్టపోయింది. లేకుంటే మార్కెట్‌ ఇపుడు గ్రీన్‌లో ఉండేది. నెస్లే ఇవాళ రెండు శాతంపైగా నష్టంతో ఉంది. అయితే చాలా వరకు న్యూఏజ్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నైకా అయిదు శాతంపైగా నష్టపోయింది. జొమాటొ మరో నాలుగు శాతంపైగా నష్టపోయి రూ. 58 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్రీన్‌ కూడా ఇదే స్థాయి నష్టంతో ఉంది.