నష్టాలు ఉన్నా… భలే కోలుకుంది
ప్రపంచ మార్కెట్లన్నీ గడగడలాడుతున్నా మన మార్కెట్ల స్వల్ప నష్టాలతో ముగియడం విశేషం. నిన్న రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతెందుకు మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా ఒక శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టి కూడా మిడ్ సెషన్‌కు ముందు ఏకంగా 160 పాయింట్లు క్షీణించినా… ఆ తరవాత సగం నష్టాలను పూడ్చుకుంది. 17452 పాయింట్లను తాకిన నిఫ్టి 17,557 స్థాయికి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 86 పాయింట్ల నష్టంతో 11532 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫ్యూచర్స్‌ను కూడా భారత మార్కెట్ ఖాతరు చేయలేదు.బ్యాంక్ నిఫ్టి కన్నా… ఫైనాన్షియల్ బాగా దెబ్బతిన్నాయి. చిత్రంగా మిడ్ క్యాప్ సూచీ కేవలం నామ మాత్రపు లాభానికి పరిమితమైంది. వినియోగదారుల రంగానికి చెందిన పలు కంపెనీల షేర్లు ఇవాళ నష్టంతో ముగిశాయి.