నష్టాల నుంచి లాభాల్లోకి… కాని
ఉదయం దాదాపు వంద పాయింట్లకుపైగా క్షీణించిన నిఫ్టి మిడ్ సెషన్ వచ్చేసరికి కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చి 17524 పాయింట్లను తాకింది. ముఖ్యంగా ఐటీ షేర్లు ఇవాళ నిఫ్టికి అండగా నిలిచాయి. బ్యాంక్, మిడ్ క్యాప్ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. ఈ రెండు సూచీలు ఇంకా ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రస్తుతం సరిగ్గా 17500 వద్ద 12 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు అర శాతంపైనే ఉన్నాయి. అలాగే యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నష్టాలు అర శాతంపైనే ఉన్నాయి. పైగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ సెటిల్మెంట్ ఉన్నందు… ఒత్తిడి వస్తుందేమో చూడాలి. పడినా 17350-17400 ప్రాంతంలో నిఫ్టికి గట్టి మద్దతు లభించే అవకాశముంది.