లాభాల్లోకి నిఫ్టి….నష్టాల్లోనే ఆర్బీఎల్
మార్కెట్ ఆల్గో ట్రేడింగ్ ప్రకారం సాగుతోంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే తొలి మద్దతు స్థాయి కోల్పోయినా.. వెంటనే రెండో మద్దతు స్థాయి నుంచి కోలుకుంది. కేవలం గంటలో 200 పాయింట్లు కోలుకుని 16833 నుంచి 17037 పాయింట్లకు చేరింది. ఉదయ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైనా బ్యాంక్ నిఫ్టి కోలుకుంది. ఆర్బీఎల్ బ్యాంక్ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి… తమకు ఇప్పట్లో మూలధన అక్కర్లేదని…ఇపుడు ఉన్న నిధులు సరిపోతాయని స్పష్టం చేసింది. సంక్షోభం లేదని పదే పదే స్పష్టం చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. ఒకదశలో రూ. 130కి పడిపోయిన ఈ షేర్ ఇపుడు రూ. 141 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్ ఇంకా 19 శాతం నష్టంతో ట్రేడవుతోంది.