చివర్లో కోలుకున్నా నష్టాలే…
మిడ్ సెషన్‌లో తీవ్ర నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి… చివర్లో అనూహ్యంగా కోలుకుంది. యూరో మార్కెట్లు నష్టాల నుంచి ఆకర్షణీయ లాభాల్లోకి రావడం, అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లోకి రావడంతో చివర్లో పొజిషనల్ ట్రేడర్లు కూడా 18200 ప్రాంతంలో భారీగా కొనుగోలు చేశారు. దీంతో మిడ్‌సెషన్ తరవాత 18209 పాయింట్లకు పడిన నిఫ్టి.. క్లోజింగ్‌లో 18307 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి నష్టాలు కేవలం 36 పాయింట్లే. బ్యాంక్ నిఫ్టి ఒక్కటే స్వల్ప నష్టతో ముగిసింది. మిగిలిన నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు అర శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇక షేర్ల విషయానికొస్తే నిఫ్టిలో హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం 2.5 శాతం, బజాజ్ ఆటో 1.79 శాతం నష్టం చొప్పున ముగిశాయి. నైకా ఇవాళ మూడున్నర శాతం లాభంతో ముగిసింది. లారస్ ల్యాబ్ ఇవాళ 2.4 శాతం నష్టపోవడంతో.. షేర్ ధర రూ. 450 దిగువకు వచ్చేసింది.