నిఫ్టి: రెండు వైపులా భలే ఛాన్స్
16,300 ప్రాంతంలో నిఫ్టి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అనేక మంది టెక్నికల్ అనలిస్టులు నిఫ్టి ఈ స్థాయిలో నిలదొక్కుకుంటుందని నమ్మబలుకుతున్నా.. వాస్తవం చిత్రం భిన్నంగా ఉంది. ఉదయం ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ఉన్న చైనా, హాంగ్ సెంగ్ ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం లాభంతో ముగిశాయి. మన మార్కెట్లు కూడా మిడ్ సెషన్ వరకు లాభాలను నిలుపుకున్నా.. యూరో మార్కెట్ల ప్రారంభం తరవాత సరిగ్గా 2 గంటల ప్రాంతంలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఈవారం వస్తున్న అన్ని ఐపీఓలకు చెత్త రేటింగ్ ఇస్తున్నారు. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సస్ నష్టాల్లోకి రావడంతో సెంటిమెంట్ బాగా దెబ్బతింది. నిఫ్టి 16350 నుంచి నేరుగా 150 పాయింట్లు పతనమైంది. 16200 ప్రాంతంలో కోలుకున్న నిఫ్టి 16,280 పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ముగిసింది. ఆల్గో ట్రేడర్స్ భారీ లాభాలు గడించాయి. సూచీలు పక్కా టెక్నికల్స్ ప్రకారం మూవ్ అవడంతో ఆల్గో ట్రేడర్స్ దాదాపు 200 పాయింట్లకు పైగా లబ్ది పొందారు. ముఖ్యంగా 16350 ప్రాంతంలో షార్ట్ చేసినవారికీ భారీ లాభాలు వచ్చాయి. ట్రేడింగ్ మొత్తం బోగస్‌లా కన్పిస్తోంది.సూచీలు గ్రీన్‌లో ఉంటే… షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టి 29 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక మిడ్ క్యాప్ సూచీ 1.66 శాతం నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టిలో ఎలాంటి కదలిక లేదు. గతవారంలో కూడా మిడ్ క్యాప్ నిఫ్టి భారీగా నష్టపోయింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
భారతీ ఎయిర్‌టెల్ 621.90 3.78
టెక్ మహీంద్రా 1,323.00 2.76
హెచ్‌డీఎఫ్‌సీ 2,671.00 1.80
కొటక్ బ్యాంక్ 1,810.00 1.63
ఎం అండ్ ఎం 785.65 1.38
నిఫ్టి టాప్ లూజర్స్
శ్రీ సిమెంట్ 27,129.00 -4.05
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 720.50 -3.59
టాటా స్టీల్ 1,372.15 -2.84
హిందాల్కో 425.05 -2.22
పవర్‌గ్రిడ్ 172.80 -2.07