MID SESSION: లాభాల్లోకి నిఫ్టి
ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న నిఫ్టి కొద్దిసేపటి క్రితం గ్రీన్‌లోకి వచ్చింది. ప్రస్తుతం 17180 పాయింట్ల వద్ద 60 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 57516 పాయింట్ల వద్ద ఉంది. ప్రధానంగా ఫైనాన్షియల్స్ బాగా కోలుకున్నాయి. దీంతో ఇవాళ్టి కనిష్ఠస్థాయి 17,006 పాయింట్ల నుంచి 170 పాయింట్లకుపైగా లాభపడింది. బ్యాంక్ నిఫ్టిలో ఫెడరల్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు కోలుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఓపెనింగ్ స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. మార్కెట్ మిడ్ సెషన్లో కోలుకోవడానికి ప్రధాన కారణం యూరో మార్కెట్లు గ్రీన్ ఓపెన్ కావడం. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి.