నష్టాల్లో నిఫ్టి… క్లోజింగ్‌లో కోలుకునేనా?
ఉదయం ఆకర్షణీయ లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి 10 గంటలకల్లా బలహీనపడి నష్టాల్లోకి జారుకుంది. గరిష్ఠ స్థాయి నుంచి 200 పాయింట్లకు పైగా క్షీణించి 17865ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 17920 పాయింట్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే 83 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 36 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లు ఇవాళ కాస్త మద్దతుగా నిలబడ్డాయి. మెటల్స్, ఐటీ షేర్లు బలహీనంగా ఉన్నాయి. దివీస్ ల్యాబ్ ఇవాళ టాప్ 5 లూజర్స్లోకి వచ్చింది. ఇవాళ ఈ షేర్ దాదాపు రెండు శాతం దాకా క్షీణించింది. హైదరాబాద్‌కే చెందిన గ్లాండ్ ఫార్మా కూడా రెండు శాతం క్షీణించింది. అదానీ గ్రూప్ షేర్లు మాత్రం మంచి లాభాల్లో ఉన్నాయి. కేవలం ఈ షేర్ల వల్లనే నిఫ్టి నెక్ట్స్ గ్రీన్‌లో ఉంది. అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్, అదానీ ఎంటర్టైన్మెంట్, అదానీ గ్రీన్, అదానీ విల్మర్.. ఇలా అనేక షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. మరో వైపు కాస్సేపటి క్రితం ప్రారంభమైన యూరో మార్కెట్లు అర శాతం పైగా లాభంతో ఉన్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్‌తో నిఫ్టిలో షార్ట్ కవరింగ్ వస్తుందేమో చూడాలి.