For Money

Business News

అదే స్థాయిలో రికవరీ

నిన్న మార్కెట్‌ బీభత్సంగా పడినా.. ఇవాళ బాగానే కోలుకుంది. నిన్న కొనుగోలు చేసినవారికి మంచి ప్రతిఫలం లభించినా… ఇవాళ ఉదయం ఓపెనింగ్‌లో ఎంటర్‌ అయిన వారికి కూడా ఒక మోస్తరు అంటే 180 పాయింట్ల లాభం ఇచ్చింది. ముఖ్యంగా మిడ్‌ సెషన్‌ కల్లా ఇవాళ్టి గరిష్ఠ 16748 పాయింట్లను తాకిన నిఫ్టి… తీరా యూరో మార్కెట్‌ లాభాలు ఒక మోస్తరుగా ఉండటంతో స్వల్పంగా లాభాల స్వీకరణ వచ్చింది. పడినపుడల్లా మద్దతు రావడంతో నిఫ్టి 16600పైనే ఉంటూ ఉంటూ వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే 410 పాయింట్ల లాభంతో 16658 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టికన్నా ఇతర రంగాల సూచీలు మరింత ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. అన్ని సూచీలు మూడు శాతం పైగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్‌ నిఫ్టి ఏకంగా 4.3 శాతం లాభంతో క్లోజైంది.