For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

భారీ నష్టాల నుంచి కోలుకుని గ్రీన్‌లోకి వచ్చిన నిఫ్టి… చివర్లో స్వల్పంగా క్షీణించింది. క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుని రిపైన్‌ చేసిన తరవాత ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం విధించింది. దీంతో రిలయన్స్‌, ఓఎన్‌జీసీ వంటి షేర్లు భారీగా నష్టపోయింది. దీంతో నిఫ్టి 15,511ని తాకింది. అక్కడి నుంచి ఇతర షేర్లు నిఫ్టిని పైకి తీసుకు వచ్చాయి. ముఖ్యంగా బజాజ్‌ ట్విన్స్‌, ఐటీసీ షేర్లు ఇవాళ గణనీయంగా పెరిగాయి.. ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతంపైగా పెరగ్గా, సిప్లా, బీపీసీఎల్‌ షేర్లు మూడు శాతంపైగా పెరిగాయి. దీంతో నిఫ్టి దిగువ స్థాయి నుంచి 250 పాయింట్లకు పైగా పెరిగి 15793కి చేరాయి. అక్కడి నుంచి స్వల్పంగా క్షీణంచి 15752వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 28 పాయింట్లు నష్టపోయింది. ఇవాళ ఓఎన్‌జీసీ 13 శాతం, రిలయన్స్‌ ఏడు శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టిలో 39 షేర్లు లాభాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా భారీ ఒత్తిడి లోనైన జొమాటొ ఇవాళ మూడు శాతంపైగా పెరగ్గా, పేటీఎం రెండున్నర శాతం క్షీణించింది.