For Money

Business News

భారీ నష్టాల తేరుకున్న నిఫ్టి

ఉదయం 16133 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టి కొద్ది సేపటి క్రితం 16373 అంటే 240 పాయింట్లు కోలుకుంది. ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 135 పాయింట్ల నష్టంతో 16362 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా నష్టపోయిన అనేక షేర్లు కోలుకున్నాయి. ముఖ్యంగా 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఇపుడు నిఫ్టి టాప్ గెయినర్‌గా ఉంది. అలాగే ఉదయం ఆరున్నర శాతం నష్టపోయిన ఏషియన్‌ పెయింట్స్‌ ఇపుడు మూడు శాతం నష్టంతో రూ.2784 వద్ద ట్రేడవుతోంది. నిన్న, ఇవాళ ఉదయం భారీగా క్షీణించిన బ్యాంక్‌ నిఫ్టి కోలుకుంది. ఇపుడు కేవలం 0.22 శాతం నష్టంతో 34,867 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.