For Money

Business News

నిఫ్టి: వదంతులతో పెరిగి.. వాస్తవాలతో తగ్గి…

గత కొన్ని రోజుల నుంచి స్టాక్‌ మార్కెట్‌ కదలికలు చూస్తుంటే కేవలం డే ట్రేడర్ల కోసమే ఉన్నట్లు కన్పిస్తోంది. షేర్‌ మార్కెట్‌లతో సాధారణ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వారు నష్టపోకూడదు… బ్రోకర్లరు, ట్రేడర్లకు లాభాలు రావాలి. ఇదే తంతు. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17,383ని తాకింది. అక్కడి నుంచి మిడ్‌ సెషన్‌ వరకు హెచ్చతుగ్గులకు లోనవుతూ వచ్చింది. మరోవైపు ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ టెలికారం రంగానికి ఊరట కల్గించే అంశాలపై నిర్ణయం తీసుకుంటుందని బిజినెస్‌ న్యూస్‌ ఛానల్స్‌, రిపోర్టు ఊదరగొట్టారు. తీరా కేబినెట్‌ భేటీ అయ్యాక చావు కబురు చల్లగా చెప్పారు. అసలు ఆ అంశాన్నే కేబినెట్‌ పరిశీలించలేదని చెప్పారు. దీంతో భారీ లాభాలను టెలికాం, సంబంధిత రంగాల షేర్లు క్షీణించాయి. నిఫ్టి 115 పాయింట్లు క్షీణించింది. ఒకదశలో 17,254 పాయింట్లకు పడింది. ఇందాక అన్నట్లు సాధారణ ఇన్వెస్టర్ల కోసం మళ్ళీ నిఫ్టిని ఓపెనింగ్‌ స్థాయికి తీసుకు వచ్చారు. వెరిశి 8 పాయింట్ల నష్టంతో 17,353 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు కొన్ని ప్రధాన షేర్లు పెరగడంతో నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చింది. మరోవైపు మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా అర శాతం దాకా లాభంతో ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కొటక్‌ బ్యాంక్‌ 1,827.80 3.57 పవర్‌గ్రిడ్‌ 173.00 1.76
గ్రాసిం 1,580.00 1.64
బీపీసీఎల్‌ 489.80 1.63
కోల్‌ ఇండియా 149.50 1.56

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
దివీస్‌ ల్యాబ్‌ 5,085.00 -2.40
నెస్లే ఇండియా 19,900.00 -2.30
విప్రో 662.90 -1.68
ఎస్‌బీఐ లైఫ్‌ 1,218.00 -1.68
హిందాల్కో 455.75 -1.42