For Money

Business News

షార్ట్‌ కవరింగా… మద్దతా?

మొత్తానికి మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లో ఉన్న నిఫ్టి… ఆ తరవాత కోలుకుని లాభాల్లో ముగిసింది. అయితే ఈ లాభాలు షార్ట్‌ కవరింగ్‌ వల్ల వచ్చినవా లేదా మద్దతు కారణంగానే అన్నది తెలియలేదు. ఎందుకంటే చెత్త పనితీరు కనబర్చిన ఎస్‌బీఐ కార్ట్స్‌ ఇవాళ లాభాల్లో ముగిసింది. అలాగే పలు షేర్లు కూడా. ఈ వారంలోనే నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉంది. దీంతో షార్ట్‌ కవరింగ్‌ వచ్చి ఉండే అవకాశముందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టి 127 పాయింట్ల లాభంతో 24,466 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ్టి స్టార్‌. ఏకంగా రెండు శాతం పెరిగింది. అలాగే ఫైనాన్షియల్‌ నిఫ్టి కూడా. మిడ్‌ క్యాప్‌ సెలెక్ట్‌ ఒక శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 0.7 శాతం పెరిగాయి. నిఫ్టిలో 31 షేర్లు లాభాల్లో ముగిశాయి.