For Money

Business News

26వేలకు చేరువలో నిఫ్టి

పడిన ప్రతిసారీ నిఫ్టి రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ సాయంతో నిఫ్టి రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఇవాళ ఆటోమొబైల్‌ షేర్లలో వచ్చిన ర్యాలీతో పాటు నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీల జోరు కారణంగా అనేక బ్లూచిప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు భారీ లాభాలతో క్లోజయ్యాయి. దాదాపు ప్రధాన సూచీలన్నీ ఇవాళ లాభాల్లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ వరకు ఒక మోస్తరు లాభాలకు పరిమితమైన నిఫ్టి ఆ తరవాత జోరందుకుంది. 12 గంటల ప్రాంతంలో నిఫ్టి 25847 పాయింట్ల స్థాయిని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 25956 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 148 పాయింట్ల లాభంతో 25939 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో బజాజ్‌ ఆటో, హహీంద్రా అండ్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఉన్నాయి. ఈ షేర్లన్నీ రెండు శాతం నుంచి మూడున్నర శాతం దాకా లాభపడటం విశేషం. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఐషర్‌ మోటార్స్‌ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, దివీస్‌ ల్యాబ్‌, విప్రో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఒక శాతం నుంచి ఒకటన్నిర శాతం నష్టంతో క్లోజయ్యాయి. నిఫ్టి నెక్ట్స్‌ 50లో అదానీ టోటల్‌ ఏకంగా 5 శాతంపైగా పెరిగింది. కెనరా బ్యాంక్‌, గెయిల్, యునైటెడ్‌ స్పిరిట్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు మూడున్నర శాతం నుంచి అయిదున్నర శాతం వరకు పెరిగాయి.

Leave a Reply