For Money

Business News

సూచీలు ఇలా… షేర్లు అలా

మార్కెట్‌ను ఇవాళ బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు ఆదుకుంటున్నాయి. ఆరంభంలో స్వల్ప లాభాల్లోకి వచ్చినా.. వెంటనే వచ్చిన ఒత్తిడి కారణంగా నిఫ్టి 22500పైనే కొనసాగుతోంది. ఇపుడు క్రితం ముగింపు వద్దే అంటే 22547 వద్ద ట్రేడవుతోంది. అయితే బ్యాంక్‌ నిఫ్టి 0.61 శాతం, ఎన్‌బీఎఫ్‌సీ సూచీ 0.82 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలను సడలించడంతో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. సూచీలు గ్రీన్‌లో ఉన్నా… అనేక షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి షేర్లలో 35 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 58 షేర్లు ఇవాళ లోయర్‌ సర్క్యూట్‌లో ట్రేడవుతుండగా, 37 షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌లో ఉన్నాయి. ఇవాళ 2581 షేర్లు ట్రేడవగా, 1903 నష్టాల్లో ట్రేడవుతున్నాయి.