For Money

Business News

కోలుకుంటుందా?

మార్కెట్‌ ఓపెనింగ్‌లో భారీగా నష్టపోయినా.. కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్లు కన్పిస్తోంది. ఆరంభంలోనే 23339 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని 23476కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి స్మాల్‌ క్యాప్‌ 0.68 శాతం నష్టంతో ఉంది. నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి పైనాన్షియల్స్ మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇవాళ ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు దూకుడు మీద ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఏకంగా 5 శాతం లాభంతో ఉంది. ఒకదశలో రూ. 684ని తాకిన షేర్‌ ఇపుడు రూ. 678 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. రెండో స్థానంలో ట్రెంట్‌ నిలిచింది. ఈ షేర్‌ కూడా మూడు శాతం దాకా లాభపడింది. పవర్‌ గ్రిడ్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజరర్స్‌లో ఇన్ఫోసిస్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ముందున్నాయి.