అరశాతం లాభంతో నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18,384 పాయింట్లకు చేరిన నిఫ్టి వెంటనే దాదాపు 50 పాయింట్లు క్షీణించి 18,338 పాయింట్లను తాకింది. నిఫ్టి ప్రస్తుతం 18353 పాయింట్ల వద్ద 87 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 48 షేర్లు లాభాంతో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నందున ఓఎన్జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది.ఫలితాలు బాగా లేనందున హావెల్స్ ఏకంగా పది శాతం నష్టపోయింది. జుబ్లియంట్ ఫుడ్స్ ఫలితాలు బాగున్నా నిన్న 9 శాతం నష్టపోయింది. ఇవాళ కూడా కూడా 3 శాతం క్షీణించింది. ఇక మిడ్ క్యాప్ నిఫ్టి కూడా ఇవాళ అర శాతం లాభంతో ట్రేడవుతోంది. ఐఆర్సీటీసీ 5 శాతం పెరిగి రూ. 4658 వద్ద ట్రేడవుతోంది.