కుప్పకూలిన స్టాక్ మార్కెట్
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా మన మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి 360 పాయింట్ల నష్టంతో 16843ని తాకింది. 200 డే మూవింగ్ యావరేజ్కు దిగువన నిఫ్టి చేరింది. ఆ వెంటనే నిఫ్టి కోలుకుని ఇపుడు 16921 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో కేవలం ఒకే ఒక్క షేర్ ఓఎన్జీసీ లాభాల్లో ఉంది. క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో ఓఎన్జీసీ లాభాల్లో ఉంది. మిగిలిన 49 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు 1.5 శాతం పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి తరవాత కీలకమైన నిఫ్టి నెక్ట్స్ 2 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు కీలక స్థాయిలను పరీక్షిస్తున్నాయి. సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉండటంతో పలు షేర్లు భారీగా నష్టపోయాయి. ప్రధాన షేర్లు నామ మాత్రపు నష్టాలు ఉన్నా… చిన్న షేర్లు మాత్రం భారీగా నష్టపోయాయి.