డిమార్ట్ అప్పర్ సీలింగ్

మార్కెట్ ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. అధిక స్థాయిల వద్ద స్వల్ప అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి 60 పాయింట్ల నష్టంతో 24127 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కంపెనీ ఆదాయం పెరగినట్లు అవెన్యూ సూపర్ మార్కెట్స్ (డిమార్ట్) నిన్న పేర్కొంది. ఇవాళ ఆ కంపెనీ కౌంటర్‌లో భారీ డీల్స్ కూడా జరిగాయి. దీంతో కంపెనీ షేర్ పది శాతం అప్పర్ సీలింగ్‌తో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఓఎన్‌జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఇక నిఫ్టి నష్టాల షేర్లలో హీరో మోటొకార్ప్ ఉంది. ఈ షేర్ రెండున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్ తరవాతి స్థానాల్లో ఉన్నాయి.