భారీ నష్టాల్లో నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18,127ని తాకి అక్కడే ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 130 పాయింట్లు నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 47 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కేవలం మూడు షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టితో పాటు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకులు, ఐటీ షేర్లు ఇవాళ భారీ ఒత్తిడికి లోనవుతోంది. మిడ్ క్యాప్ ఓకే. నిఫ్టి కన్నా తక్కువ నష్టాలతో ఉంది. మార్కెట్ 18100 దిగువకు వెళుతుందేమో చూడండి. అదే జరిగితే మార్కెట్‌కు కాస్త దూరంగా ఉండటం మంచిది. పేటీఎం ఇవాళ కూడా నష్టాల్లోఉంది. రూ.1000 దగ్గరగా ఉంది. ఏక్షణమైనా మూడు అంకెల సంఖ్యకు ఈ షేర్ ధర పడే అవకాశముంది.