నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే… ఆసియా మార్కెట్లకు భిన్నంగా నష్టాల్లో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17943 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత 17883 స్థాయిని తాకింది.ఇపుడు 26 పాయింట్ల నష్టంతో 17912 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇతర సూచీల విషయానికి వస్తే… అన్నీ స్థిరంగా ఉన్నాయి. లాభనష్టాల్లో ఉన్నా .. నామ మాత్రమే. నిఫ్టిలో 31 షేర్లు గ్రీన్‌లో ఉండగా, 19 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అయితే సూచీ మాత్రం నష్టాల్లో ఉంది. టాప్ గెయినర్స్‌లో టాటా కన్జూమర్ ఉంది. ఫలితాలు ప్రకటించిన బజాజ్ ఆటో నష్టాల్లోకి ట్రేడవుతోంది. నెస్లే రూ.19,000 దిగువకు వచ్చింది. ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర ఐటీ కౌంటర్లు బలహీనంగా ఉన్నాయి.