లాభాలు నిలబడేనా?

నిఫ్టి ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలో నిఫ్టి 24665కి చేరినా.. ప్రస్తుతం 24533 వద్ద ట్రేడవుతోంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు దీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నా.. సూచీలు నిలబడలేకపోతున్నాయి. సాధారణ ఇన్వెస్టర్లు కూడా లాభాలు స్వీకరించడంతో సూచీలు బలహీనంగా ఉన్నాయి. ఇన్నాళ్ళూ లాభాల్లో ఉన్న ఆటో షేర్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. అయితే జీఎస్టీ భారీగా తగ్గనున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ సూచీ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ప్రస్తుతం 745 షేర్లు నష్టాల్లో ఉండగా, 1514 షేర్లు లాభాల్లో ఉన్నాయి. మున్ముందు విదేశీ ఇన్వెస్టర్ల రియాక్షన్ కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్‌కు దిగితే గాని… సూచీలు భారీగా పెరిగే ఛాన్స్ కన్పించడం లేదు.