నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 22045ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 22090 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 56 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ షేర్లు మాత్రం ఇవాళ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 50లో పవర్‌గ్రిడ్ టాప్ గెయినర్‌గా ఉంది. అదానీ షేర్లలో ఇవాళ కూడా ర్యాలీ కొనసాగుతోంది. అదానీ టోటల్, అదానీ విల్మర్, అదానీ ఎనర్జి షేర్లు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది.