For Money

Business News

లాభాల్లో ఆరంభం

మార్కెట్‌ ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 24500 స్థాయిని దాటింది. 24457ను తాకిన తరవాత ఇపుడు 24412 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 84 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్లో ఉన్నాయి. ఇవాళ 2409 షేర్లు ట్రేడవగా 2027 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో బీఈఎల్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో టాటా మోటార్స్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో సిప్లా, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు న్నాయి.