సూచీలు లాభాల్లో ఉన్నా…

రిలయన్స్ అండతో నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ఓపెనింగ్‌లోనే నిఫ్టి 24152 పాయింట్లను తాకింది. ఇపుడు 24116 వద్ద 77 పాయింట్ల లాభంతో ఉంది. సూచీలు లాభాల్లో ఉన్నా… మెజారిటీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ 2330 షేర్లు ట్రేడవగా, 1388 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎం అండ్ ఎం, బీఈఎల్‌తోపాటు ఎస్‌బీఐ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో శ్రీరామ్ ఫైనాన్స్, మారుతీ, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఉన్నాయి.