స్థిరంగా ప్రారంభం…
మార్కెట్లు కీలక స్థాయిలో ట్రేడవుతున్నాయి. నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టీలు 200 రోజుల చలన సగటులకు సమీపంలో ట్రేడవుతున్నాయి. ఈ స్థాయిని నిఫ్టి కాపాడుకుంటే మార్కెట్ కొన్నాళ్ళు గ్రీన్‌లో కొనసాగవచ్చు. అయితే ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉండటంతో … సూచీలు హెచ్చుతగ్గులకు ఛాన్స్ ఉండే అవకాశముంది. గత కొన్ని రోజులుగా సెల్ ఆన్ రైజ్ ఫార్మాలాలో ట్రేడర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిఫ్టి పెరిగినా… అధికస్థాయిలో నిలబడుతుందా అన్న అనుమానం ఉంది. నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉన్నందున… షార్ట్ రికవరీ ఉంటుందని కొందరు అంటున్నారు.ఈ నేపథ్యంలో నిఫ్టి ప్రస్తుతం 26 పాయింట్ల లాభంలో 23584 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 125 పాయింట్లతో ఉంది. ఇవాళ స్విగ్గీకి పోటీగా జొమాటో లాభాల్లో ఉంది. ఇక నిఫ్టితో పాటు ప్రధాన రంగాల సూచీలన్నీ గ్రీన్‌లో ఉండటం విశేషం. నిఫ్టి షేర్లలో 26 షేర్లు లాభాల్లో ఉండగా… ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్‌గా ఉంది. తరువాతి స్థానాల్లో హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న షేర్లలో అల్ట్రాటెక్ టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో బీపీసీఎల్, హిందుస్థాన్ లీవర్, ఎం అండ్ ఎం, శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి.