లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి
మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి 25411 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 25389 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 33 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్స్‌లో స్వల్ప ఒత్తిడి కన్పిస్తోంది. బ్యాంకు షేర్లు నిలకడగా ఉన్నా… నిఫ్టి నెక్ట్స్ సూచీ స్వల్ప లాభాల్లో ఉంది. నిఫ్టి షేర్లలో అదానీ ఎంటర్‌ప్రైజస్, హిందాల్కో, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్ టాప్‌లో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో హిందుస్థాన్ లీవర్, బ్రిటానియా ముందున్నాయి.