బజాజ్ ట్విన్స్ భళా…

ఊహించినట్లే ఇవాళ బజాజ్ ఫైనాన్స్ ఇవాళ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఓపెనింగ్‌లోనే ఈ షేర్ రూ. 7143ని తాకింది. ఇవాళ ఈ షేర్ 5 శాతం లాభంతో ట్రేడవుతుండగా, బజాజ్ ఫిన్ కూడా 2.5 శాతం లాభంతో రూ. 1834 వద్ద ట్రేడవుతోంది. ఎన్టీపీసీ, కోల్ ఇండియా, హిందాల్కో షేర్లు టాప్ ఫైవ్ నిఫ్టి గెయినర్స్‌లో ఉన్నాయి. నిఫ్టి ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకుని 23139 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి కోలుకుని 23179 వద్ద ట్రేడేవుతోంది. స్మాల్ క్యాప్ షేర్లలో ఇవాళ కూడా కొనుగోళ్ళు సాగుతున్నాయి. మిడ్ క్యాప్ షేర్లు నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టి దాదాపు క్రితం ముగింపు వద్దే ఉంది. బజాజ్ ట్విన్స్ కారణంగా ఎన్బీఐఎఫ్ షేర్ల సూచీ నిఫ్టి ఫైనాన్స్ గ్రీన్‌లో ఉంది.