కొనసాగుతున్న ఒత్తిడి
మార్కెట్ డైరెక్షన్‌లెస్‌గా సాగుతోంది. కొనుగోలదారుల నుంచి తాజాగా మద్దతు లేకపోవడంతో అంతా విదేశీ ఇన్వెస్టర్ల చేతిలోకి మార్కెట్ వెళ్ళింది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా తమ కొనుగోళ్ళను తగ్గించారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. చైనా ఎన్‌సీపీ సమావేశం ఇవాళ ముగుస్తుంది. ఈ సమావేశ వివరాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. అమెరికా మార్కెట్ల దూకుడు జోరుగా ఉంది. ఇవాళ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో మార్కెట్ గ్రీన్‌లోనే ఉండే అవకాశముంది. ఈనేపథ్యంలో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నష్టాల్లో ఉన్నా నామ మాత్రంగానే ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 24187 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్స్ మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. టెక్ షేర్లలో ఇవాళ కూడా ఆసక్తి కొనసాగుతోంది.