For Money

Business News

స్థిరంగా మొదలు…

ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీకి ముందు మార్కెట్‌ స్థిరంగా ప్రారంభమైంది. నిఫ్టి దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. ఆర్బీఐ ఇవాళ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. మరి ఆర్బీఐ గవర్నర్‌ సర్‌ప్రైజ్‌ చేస్తారేమో చూడాలి. మిడ్‌క్యాప్‌ షేర్లు నిలకడగా ఉన్నా.. బ్యాంక్‌ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. నిన్నటి మాదిరే స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి. ఇక ట్రెంట్‌లో అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. ఇవాళ కూడా రెండు శాతంపైగా లాభంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక బజాజ్‌ ఆటో తరవాతి స్థానంలో ఉంది. హీరో మోటోకాప్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న షేర్లలో ఐటీ షేర్లు ఉన్నాయి,. అయితే నష్టాలు చాలా స్వల్పంగా. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో టీసీఎస్‌ టాప్‌లో ఉంది.