For Money

Business News

స్థిరంగా స్టాక్‌ మార్కెట్లు

ఫెడ్‌ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు నిలకడగా ట్రేడుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్ల దృష్టి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఉంది. ఇవాళ నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఆరంభంలోనే 25380ని తాకినా వెంటనే మద్దతు అందడంతో నిఫ్టి ఇపుడు 25413 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు ఫైనాన్సియల్‌ నిఫ్టి అర శాతం దాకా లాభంతో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి మాత్రం 0.4 శాతం నష్టంతో ఉంది. నిఫ్టి స్థిరంగా ఉన్నా… 34 షేర్లు లాభాల్లో ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే బాగా లబ్ది పొందే రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో హీరోమోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ముందున్నాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ట్రీ, విప్రో, టీసీఎస్‌ షేర్లు ఉన్నాయి.

Leave a Reply