స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
మార్కెట్ చాలా నిస్తేజంగా ప్రారంభమైంది. సూచీల్లో పెద్దగా మార్పులు లేవు. నిఫ్టి ప్రస్తుతం 27 పాయింట్ల నష్టంతో 18457 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఆల్ టైమ్ హైని తాకిన తరవాత 120 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్ స్వల్ప నష్టాల్లో ఉంది. నిఫ్టి బ్యాంక్, నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీలు మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. హెచ్డీఎఫ్‌సీ లైఫ్ ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్ ఒక శాతంపైగా లాభపడింది. నిన్న 5 శాతం దాకా పెరిగిన అపోలో హాస్పిటల్స్ షేర్ ఇవాళ కూడా ఒక శాతం లాభంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌లో పేటీఎం టాప్ గెయినర్‌గా ఉంది. ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా సిటీ బ్యాంక్ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ షేర్ ఇవాళ 3.4 శాతం పెరిగి రూ.456 వద్ద ట్రేడవుతోంది. నైకా కూడా ఒకటిన్నర శాతం పెరిగింది. అదానీ గ్రీన్ ఇవాళ రెండు శాతం నష్టంతో ఉంది. డిక్సన్, ఇండియ హోటల్స్ షేర్లు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. చాలా రోజుల తరవాత లారస్ ల్యాబ్ గ్రీన్‌లో ఉంది. జూబ్లియంట్ ఫుడ్ ఇవాళ నష్టాల్లో ఉండటం విశేషం. చాలా మంది అనలిస్టులు ఈ షేర్ ఇవాళ కొనుగోలు చేయాలని సిఫారసు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అప్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఈ షేర్ మరో 2.75 శాతం పెరిగింది. నిన్న ఐటీ షేర్లు బాగా రాణించాయి. దీంతో ఇవాళ చాలా మంది అనలిస్టులు ఐటీ షేర్లను సిఫారసు చేశారు. అయితే ఐటీ సూచీ స్వల్ప నష్టంతో ఉంది. పర్సిస్టెన్స్ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది. కో ఫోర్జ్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు స్వల్ప లాభాలతో ఉన్నాయి.