సూచీలు గ్రీన్‌లో.. షేర్లు నష్టాల్లో
నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15363 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 15319 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 25 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి 25 షేర్లు లాభాల్లో మిగిలిన 25 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నా… అవి నామ మాత్రమే. నిఫ్టిలో సన్ ఫార్మా టాప్ గెయినర్‌గా నిలిచింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినందున ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ షేర్లు నిఫ్టి టాప్ గెయినర్‌లో ఉన్నాయి. ఇదే కారణంతో ఓఎన్‌జీసీ షేర్ నాలుగున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక్కటే గ్రీన్‌లో ఉంది. శుక్రవారం అమెరికా మార్కెట్‌లో ఏడీఆర్ ఆరు శాతం దాకా పెరగ్గా… మన మార్కెట్‌లో 0.7 శాతానికి పరిమితమైంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మరింత క్షీణించి మూడు శాతం నష్టంతో రూ.30.65 వద్ద ట్రేడవుతోంది.