గ్రీన్‌లో ప్రారంభమైనా…
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైనా.. రెండు నిమిషాల్లోనే మొత్తం లాభాలను కోల్పోయింది. ఓపెనింగ్‌లో16,485ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16413 వద్ద ట్రేడవుతోంది. అంటే క్రితం ముగింపుతో పోలిస్తే మూడు పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మరో 45 నిమిషాల్లో ఆర్బీఐ పరపతి విధానం వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు స్థిరంగా దాదాపు క్రితం ముగింపు స్థాయిలోనే ఉన్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు నిఫ్టి టాప్‌గెయినర్స్‌గా నిలిచాయి. మారుతీ, గ్రాసిం టాప్ లూజర్స్‌గా ట్రేడవుతున్నాయి. చాలా వరకు షేర్లు స్థిరంగా ఉన్నాయి. నిఫ్టి పడితే కొనుగోలు చేయాల్సిందిగా ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ 18 ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ… నిఫ్టి కాల్స్ కొనుగోలు చేయాల్సిందిగా ఆయన ట్రేడర్లకు సూచించారు.