For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభైంది. ఆరంభంలో 17062కు క్షీణించినా.. వెంటనే కోలుకుని ఇపుడు 17109 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నా…అన్ని నామ మాత్రపు నష్టాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ, ఐఓసీ లాభపడ్డాయి. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ షేర్లపై ఒత్తిడి పెరిగింది. బ్యాంక్‌ షేర్లలో కొటక్‌ బ్యాంక్‌ మినహా మిగిలిన బ్యాంకులన్నీ నష్టాల్లో ఉన్నాయి. బంధన్‌ బ్యాంక్‌ ఇవాళ కూడా 3 శాతం నష్టంతో ట్రేడవుతోంది.