స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టికి అనుకున్నట్లే 15,711 వద్ద నిఫ్టికి ప్రతిఘటన ఎదురైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 12 పాయింట్ల నష్టంతో 11,668 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అయితే నామమాత్రంగానే ఉన్నాయి. ఫలితాలు, ఇతర వార్తల ఆధారంగా కొన్ని షేర్లు పెరగడం వినా… నిఫ్టిలో పెద్దగా మార్పు లేదు. నిఫ్టి మళ్ళీ 15700 దాటితే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. ముఖ్యంగా మిడ్ సెషన్లోగా నిఫ్టి క్షీణించే అవకాశముంది. ఆసియా మార్కెట్ల ప్రభావం యూరో మారెట్లపై ఉంటుందేమో చూడాలి. ఉంటే మాత్రం నిఫ్టి 15600 ప్రాంతానికి వచ్చే అవకాశముంది. పొజిషనల్ ట్రేడర్స్ నిఫ్టి 15,450-15,500 వరకు వెయిట్ చేయొచ్చు. నిఫ్టి ఈ నెలలోనే మళ్ళీ కోలుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. 15,500లోపలకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. డే ట్రేడర్స్ నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మి… లాభాలు స్వీకరించడం ఉత్తమం. దిగువ స్థాయిలో కొనుగోలు చేయడం అనవసరం.
నిఫ్టి టాప్ గెయినర్స్
అదానీ పోర్ట్స్ 712.35 1.32
ఓఎన్జీసీ 120.25 1.18
హీరోమోటోకార్ప్ 2,948.50 0.89
ఐఓసీ 108.50 0.88 దివీస్ ల్యాబ్ 4,469.95 0.77
నిఫ్టి టాప్ లూజర్స్
JSW స్టీల్ 672.70 -1.15
టీసీఎస్ 3,310.20 -0.94
టాటా మోటార్స్ 341.25 -0.87
హిందాల్కో 376.45 -0.78
ఇన్ఫోసిస్ 1,549.10 -0.72