For Money

Business News

17,700 దిగువన నిఫ్టి

మార్కెట్‌ ఆరంభంలోనే 17700 దిగువకు పడిపోయింది. ఓపెనింగ్‌లో 17,761 వద్ద ప్రారంభైన ఈ కంపెనీ కొన్ని నిమిషాల్లోనే 17689ని తాకిన నిఫ్టి ఇపుడు 17690 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 93.75 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి ఫైనాన్షియల్‌ సూచీలు అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నిక్స్ట్‌, నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీలు అర శాతం వరకు లాభంతో ఉన్నాయి. యూరప్‌ అమ్మకాలు బాగుండటంతో టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్‌గా ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్‌ గ్రీన్‌లో ఉంది. ఇక వారం రోజుల నుంచి ఎన్‌టీపీసీ, కోల్‌ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక నిఫ్టి నష్టాల్లో ఇన్ఫోసిస్‌ ముందుంది. ఇవాళ ఫలితాలు ప్రకటించనున్న టీసీఎస్‌ నష్టాల్లో ట్రేడవుతోంది.