For Money

Business News

16,500 దిగున నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే వంద పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్‌, ఆర్థిక సంస్థల షేర్లలో ఒత్తిడి వచ్చింది. మెటల్‌ షేర్లు ఒక శాతంపై లాభంతో ట్రేడ్‌ కావడంతో నిఫ్టి నష్టాలు తగ్గాయని చెప్పాలి. ఓపెనింగ్‌లో 16,470ని తాకిన నిఫ్టి ఇపుడు 16,515 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 79 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 39 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టితో పాటు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా 0.93 శాతం నిఫ్టి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచీ క్షీణించింది. అతి తక్కువగా 0.23 శాతం నష్టంతో నిఫ్టి నెక్ట్స్‌ ట్రేడవుతోంది. నిన్న లాభాలు పొందిన షేర్లు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలోని 12 షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్‌ భారీ నష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఐటీ షేర్లు దారుణంగా పడ్డాయి. అమెరికాలోని చైనా ఐటీ కంపెనీలు భారీగా నష్టపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరి మన ఐటీ షేర్లు దీనికి ఎలా స్పందిస్తాయో చూడాలి.