17100పైన ప్రారంభమైన నిఫ్టి
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17132ని తాకి ఇపుడు 17075 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 6 పాయింట్లలాభంతో ట్రేడవుతోంది. ఫలితాలకు మార్కెట్ స్పందిస్తోంది. ఫలితాలు నిరాశాజనకంగా ఉన్న కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అలాగే ఫార్మా కౌంటర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. ఈ కంపెనీల ఫలితాలపై మార్కెట్ పెద్ద ఉత్సాహంగా లేదు. డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ కూడా నష్టాల్లో ఉంది. ఇవాళ ఆటో షేర్లు పరవాలేదు. ఇక సూచీల విషయానికొస్తే నిఫ్టి మిడ్ క్యాప్ అర శాతం లాభంలో ఉండగా మిగిలిన సూచీలన్నీ నామ మాత్రపు లాభాలతో ఉంది. జొమాటో షేర్ రూ.70 దిగువకు వచ్చేసింది. ఫలితాలు బాగుండటంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ మిడ్ క్యాప్‌లో టాప్ గెయినర్‌గా ఉంది. మొన్న భారీగా క్షీణించిన డిక్షన్ టెక్నాలజీ ఇవాళ ఒక శాతం లాభపడింది.