23,000 ఎగువన..

రాత్రి అమెరికా మార్కెట్లలో వచ్చిన రికవరీ తాలూకు ప్రభావం ఆసియా మార్కెట్లలో కన్పిస్తోంది. మన మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లో 23000 స్థాయిని దాటింది. తాజా సమాచారం మేరకు నిఫ్టి 76 పాయింట్ల లాభంతో 23033 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో కన్పిస్తున్నా… లాభాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్స్ ఇవాళ కూడా బలహీనంగా కన్పిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టి కూడా క్రితం స్థాయి వద్దే తచ్చాడుతోంది. ఇక స్మాల్ క్యాప్ షేర్ల సూచీ మాత్రం అర శాతం లాభంతో ఉంది. 2136 షేర్లు ట్రేడవుతుండగా… 1572 షేర్లు లాభాలో ఉన్నాయి. అయితే లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. నిఫ్టిలో బజాజ్ ఆటో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్ 4 శాతం పెరగ్గా, సిప్లా రెండు శాతంపైగా లాభపడింది. ఇన్ఫోసిస్, బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. నిఫ్టి టాప్ లూజర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ అగ్రస్థానంలో ఉంది.