18100పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18108ని తాకిన నిఫ్టి ఇపుడు 18094 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 42 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 37 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీ ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. కాకపోతే అన్నీ నామ మాత్రపు లాభాలతో ఉన్నాయి. నిన్న భారీగా పెరిగిన కొన్ని ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఐటీ షేర్లలో ఇంకా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక శాతంపైగా నష్టంతో ఇన్ఫోసిస్ రూ. 1513 వద్ద ట్రేడవుతోంది. నాస్డాక్ ప్రభావం మన ఐటీ షేర్లపై బాగా కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టిలో ఒక్క ఎస్బీఐ మాత్రమే నష్టాల్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఒక శాతం లాభంతో ఉంది. నిఫ్టిలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితాలను బట్టి కొన్ని
షేరర్ల ధరల్లో మార్పు రావొచ్చని భావిస్తున్నారు.