For Money

Business News

17950పైన నిఫ్టి

టీసీఎస్‌ జోష్‌తో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17950ని దాటింది. 17913 వద్ద ప్రారంభమై… 17955ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 17938 వద్ద 126 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టి 43 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి తరవాత కీలక షేర్లు ఉండే సూచీ నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం 0.23 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ ఐటీతో పాటు బ్యాంకు షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతంపైగా లాభపడింది. ఎన్‌బీఎఫ్‌సీలలో కూడా జోష్‌ కన్పిస్తోంది. నిఫ్టి ఇవాళ్టి ప్రతిఘటన స్థాయిని తాకిందనే చెప్పాలి. మరి రెండో ప్రతిఘటన స్థాయి 17976ని నిఫ్టి దాటుతుందా అనేది చూడాంది.